అర్హులైన ఏ ఒక్కరు పింఛన్ రాకుండా మిగిలిపోరాదు-కలెక్టర్

12 వేల మంది పింఛనుదారులు…
నెల్లూరు: అర్హులైన ఏ ఒక్కరు పింఛన్ రాకుండా మిగిలిపోరాదని, వారి అభ్యర్థనలను క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే జనవరి 5వ తేదీలోగా నివేదికలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతినెల మూడు లక్షల మందికి పైగా లబ్ధిదారులకు 80 కోట్ల రూపాయల మేరకు పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దాదాపు 12 వేల మంది పింఛనుదారులను అనర్హులుగా గుర్తించడం జరిగిందని, వారందరికీ తప్పనిసరిగా నోటీసులు వెంటనే జారీ చేయాలన్నారు.వారి నుండి అభ్యర్థనలను సరైన ఆధారాలతో స్వీకరించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వాటిని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే జనవరి నెల 5వ తేదీలోగా సంబంధిత నివేదికలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు.వారి అభ్యర్థనలను సచివాలయ సిబ్బందితో సహా ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి పరిశీలించాలని సూచించారు.ఈ విషయమై ప్రతిరోజు మండల ప్రత్యేక అధికారులు వ్యక్తిగత శ్రద్ధతో పర్యవేక్షించి రోజువారి నివేదికలు అందజేయాలన్నారు.అర్హులైన ఏ ఒక్క పింఛనుదారు కూడా పింఛన్ రాకుండా తప్పిపోరాదని, అనర్హులు ఏ ఒక్కరు కూడా పింఛను పొందరాదని స్పష్టం చేశారు.