విజయదశమికి నాటికి “స్టార్ లైనర్ “ పేరిట non-a/c స్లీపర్ సర్వీసులు-తిరుమలరావు

అమరావతి: విజయదశమి పండగ సందర్భంగా ప్రయాణీకులకు APSRTC శుభవార్త తెలిపింది..ఈ దశరా నాటికి “స్టార్ లైనర్ “ పేరిట non-a/c స్లీపర్ సర్వీస్ ను ప్రారంభిస్తామని APSRTC M.D ద్వారకా.తిరుమలరావు వెల్లడించారు..దసరా పండుగ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలకు 4100 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని,,ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సాధారణ బస్సులకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఎం.డీ తెలిపారు. రాష్ట్రంలోని వివిధప్రాంతాల నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు.. పండగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టమని,,ఈ సంవత్సరం సరికొత్త పద్దతిలో ప్రయోగాత్మకంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు..ఈ సంవత్సరం తమ సంస్థ చేపట్టిన విధానంలో మంచి ఫలితాలు వస్తే,, ఇదే విధానాన్ని ఇక నుంచి కొనసాగిస్తామని,, లేదంటే పాత విధానం అమలు గురించి మళ్లీ ఆలోచిస్తామన్నారు. ప్రయాణీకుల సౌకర్యార్ధం,, ప్రయాణికులు ఫిర్యాదులు, సలహాల కోసం 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ప్రయాణికులకు ఏదైన సమస్య వున్నట్లయితే 0866 2570005 నెంబర్ కు ఫోన్ చేసి తెలియచేయవచ్చన్నారు.