NATIONAL

ఈశాన్య భారతం వేగంగా అభివృద్ది చెందుతుంది-ప్రధాని మోదీ

అమరావతి: ప్రకృతి సహజ వనరులతో నిండి వున్న మేఘాలయా వేగంగా అభివృద్ది చెందుతుందని,ఇందుకు అవసరమైన నిధులను కేంద్రం అందచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా అదివారం మేఘాలయ,, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధానిమోదీ,,హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. తొలుత మేఘాలయలోని షిల్లాంగ్‌లో జరిగిన ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల్లో రూ.6,800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. మేఘాలయాలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఘనస్వాగతం లభించింది. షిల్లాంగ్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. ఈ ప్రాంత అభివృద్ధిపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందన్నారు. దేశంలో అన్ని ప్రాంతాల వలె ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.అనంతరం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ, ప్రధాని మోదీ పాలనలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు.ఈశాన్య ప్రాంతంలో ప్రస్తుతం శాంతి నెలకొని ఉందని తెలిపారు. గతంలో ఆర్మడ్ ఫోర్సెస్‌ (స్పెషల్ పవర్) యాక్ట్ ను రద్దు చేయాలని చాలా డిమాండ్లు వచ్చాయని, . ఇప్పుడు ఎవరూ డిమాండ్ చేయనవసరం లేకుండా ప్రభుత్వమే అడుగు ముందుకేసి ఆర్మడ్ ఫోర్సెస్‌ (స్పెషల్ పవర్) యాక్ట్ రద్దుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. గతంలో ఈశాన్య ప్రాంతాల్లో నిరసనలు, సమ్మెలు, బాంబు పేలుళ్లు, కాల్పులతో నిత్య అల్లకల్లోంగా వుండేదని, దిని కారణంగా  స్థానికంగా పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి జరగలేదన్నారు. గడిచిన 8 సంవత్సరాల్లో ఈశాన్య ప్రాంతం ఎంతో పురోగతి సాధిస్తోందని చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *