CRIMENATIONAL

సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే మిస్త్రీ మరణానికి కారణం?-మహింద్రా

అమరావతి: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54)తో పాటు ప్రయాణిస్తున్నకారులో నాలుగురు ప్రయాణిస్తుండగా,మిస్త్రీలో పాటు జహంగీర్ పండోల్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలారు..ఆదివారం గుజరాత్ నుంచి ముంబయి వస్తున్న వీరు ప్రయాణిస్తోన్న కారు పాల్ ఘర్ జిల్లాలోని సూర్యనందిపై ఉన్న వంతెన వద్ద డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది..ఈ సంఘటనపై పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి..కారు ప్రమాదంకు గురైన సమయంలో, ప్రముఖ గైనకాలజిస్టు అనహితా పండోల్ డ్రైవ్ చేస్తుంది..ఆమె భర్త డేరియస్ ముందు సీట్లో కూర్చుకున్నాడు..వెనుకు సీట్లో సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోల్ కూర్చున్నారు..ఈ ప్రమాదానికి కారణంగా అతివేగమేనని పోలీసులు కనుగొన్నారు..వీరు కేవలం 9 నిమిషాల్లోనే 20 కిలో మీటర్లు ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు..పాల్ ఘర్ జిల్లాలోని చరోటీ చెక్ పోస్ట్ వద్ద ఉన్న సీసీ టీవీ పుటేజ్ లను పరిశీలించిన పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించారు..ఆదివారం మధ్యాహ్నం 2.21 గంటలకు చరోటీ చెక్ పోస్టు దాటన వీరి కారు,,ఈ చెక్ పోస్టుకు 20 కిలో మీటర్లు దూరంలో వంతెన వద్ద డివైడర్ ను ఢీకొట్టింది..అప్పుడు సమయం మధ్నాహ్నం 2.30 గంటలుగా పోలీసులు గుర్తించారు..సైరస్ మిస్త్రీ మరణం పట్ల మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా భావోద్వేగమైన ట్వీట్ చేశాడు. పోలీసుల విచారణలో కారు ప్రమాద సమయంలో వెనుకాల సీటులో కూర్చున్న సైరస్ మిస్త్రీ, జహింగీర్ పండోల్ ఇద్దరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు..ముందు సీటులో వున్నవారిందరూ గాయాలతో బయటపడ్డారు..ఇదే సమయంలో బ్యాక్ సీటులో వున్న వీరు బెల్టు పెట్టుకొని ఉంటే వారు మృతిచెందే వారు కాదని పోలీసులు అంచనా వేశారని ఆనంద్ మహింద్రా ట్వీట్ లో పేర్కొన్నాడు..ప్రతిఒక్కరూ సీటు బెల్టు ధరించాలని కోరారు. కారులో వెనుక సీట్లో కూర్చున్నాసరే ఎల్లప్పుడూ సీటు బెల్టు ధరించాలని కోరారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *