హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందే-నరసింహ యాదవ్

శ్రీకాళహస్తి: జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న NTR హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని YSRతో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చెయ్యలేదని,36 ఏళ్ల క్రితం NTR ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు NTR పేరు తొలగించి YSR పేరు పెట్టడం అర్థరహితమని తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.గురువారం శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం అయన మాట్లాడుతూ మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని ఈ ప్రభుత్వం,ఉన్న వాటికే పేర్లు మార్చడం శోచనీయంమన్నారు..వర్సిటీ కి చెందిన 450 కోట్ల నిధులు సైతం బలవంతంగా దారి మళ్లీంచడంతో,,వర్సీటీకి నిధుల కొరతతో పలు సమస్యలు ఎదుర్కొంటుందన్నారు. ఏ హక్కుతో పేరు మార్చుతుంది? కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసి…వర్సిటీ పరువు తీసి ఇప్పుడు పేరు మార్చుతారా? పాలకులు అనే వారు వ్యవస్థలను, సంస్థలను నిర్మిస్తేనే పేరు వస్తుంది అనే విషయాన్ని సిఎం జగన్ తెలుసుకోవాలన్నారు.ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు రెడ్డి వారి గురవారెడ్డి, పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ పార్లమెంట్ నాయకులు కంఠ రమేష్, ప్రకాష్ నాయుడు, తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, మాజీ పాలసోసైటీ చైర్మన్ మునిరాజా,మున్సిపల్ వైస్ చైర్మన్ విన్నల్ రవి, ప్రసాద్, తొట్టంబేడు మండల్ నాయకులు గాలి మురళి, చలపతి,టిడిపి నాయకులు వెంకటరమణ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.