నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో స్వాతన-అన్ని కేసులను ఢిల్లీకి బదలీ చేయండి-సుప్రీమ్

అమరావతి: బీజేపీ మాజీ అధికార ప్రతినిధి,,బహిష్కృత నేత నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో స్వాతన లభించింది..తనకు ప్రాణహాని ఉందన్న నుపుర్ వినతి పిటిషన్ పై సానుకూలంగా స్పందించింది..నుపుర్ పై దాఖలైన అన్ని కేసులను కలిపి ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (SFSO) యూనిట్‌కు బదిలీ చేయాలని వివిధ రాష్ట్రాల పోలీస్ శాఖలను జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలా నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.. దర్యాప్తు పూర్తయ్యే వరకు నుపుర్ ను అరెస్ట్ చేయకూడదని,,అరెస్ట్ విషయంలో ఇప్పటిదాకా రక్షణ కల్పించిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది..తనకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని FIRలను కొట్టేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను కూడా నుపుర్ శర్మకు ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది..ఈ కేసు విషయంలో కొత్తగా ఏదైనా FIR నమోదు అయినా కూడా ఢిల్లీకే బదిలీ చేయాలని సుప్రీం అదేశించింది..
SC clubs & transfers all FIRs against Nupur Sharma over alleged hate statement on Prophet Mohammad, to Delhi
(File Pic) pic.twitter.com/F8bnEzdYBy
— ANI (@ANI) August 10, 2022