అమరావతి: ఒడిశా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి నబ కిశోర్‌దాస్ పై ASI కాల్పులు జరిపారు..అత్యంత సమీపం నుంచి జరిపిన కాల్పుల్లో రెండు బుల్లెట్లు చాతీలోకి దూసుకెళ్లాయి..వెంటనే భద్రతా సిబ్బంది మంత్రిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి,,అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం భువనేస్వర్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు..ఆదివారం ఝార్సుగూడ బ్రిజరాజ్ నగర్‌లోని గాంధీచౌక్ వద్ద రెండు మునిసిపాల్ కార్పొరేషన్ బిల్డింగ్స్ ను ప్రారంభించేందుకు మంత్రి వచ్చాడు..తన కారుదిగి వెళ్తున్న క్రమంలో కాల్పులు జరిపారని డీజీపీ తెలిపారు..DGP సునీల్ బాన్స్ ల్ మీడియాతో మాట్లాడుతూ గాంధీ చౌక్ పోలీసు ఆవుల్ పోస్ట్ లో ASIగా పనిచేస్తున్న గోపాల్ దాస్,,పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపారని వెల్లడించారు..అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నమని,, త్వరలో అన్ని వివరాలు తెలియచేస్తామన్నారు..(అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంత్రి మృతి చెందారు.)