జోషిమఠ్ లో దెబ్బతిన్న ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు

బాధితులను తాత్కలిక నివాసాలకు తరలింపు..
అమరావతి: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణంలో పగుళ్లు ఏర్పడిన ఇళ్లు, హోటళ్ల కూల్చివేతలను అధికారులు మంగళవారం ప్రారంభించారు.. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సురక్షితం కాని నిర్మాణాలనుకూల్చివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సందు ఉత్తర్వులు జారీ చేశారు..జోషిమఠ్ వాసులను తాత్కాలిక నివాస ప్రాంతాలకు తరలించారు..భూమి కుంగుతుండడంతో జోషిమఠ్ లో ఇళ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి..పగుళ్లు ఏర్పడిన ఇళ్ల సంఖ్య 678కి చేరింది..ఇప్పటి వరకు దాదాపుగా 100 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు..దెబ్బతిన్న ఇళ్లకు అధికారులు రెడ్ క్రాస్ మార్కులు వేశారు..బాధిత కుటుంబాలకు నెలకు 4 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థికసాయం అందించారు..ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బాధిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని స్వయంగా పరివేక్ష్యిస్తున్నారు..భద్రత,,రెస్క్యూ ఆపరేషన్ల కోసం అదనంగా 11 కోట్ల రూపాయలను సీ.ఎం విడుదల చేశారు.
Joshimath: Demolition of damaged hotels, houses to begin today
Read @ANI Story | https://t.co/OFu1L40hYI#Joshimath #JoshimathDemolition #Uttarakhand pic.twitter.com/LsfXVdJbnj
— ANI Digital (@ani_digital) January 10, 2023