CRIMENATIONAL

సీఎం ఆదేశాలతో బుల్డోజర్లతో వనతార రిసార్టును కూల్చేసిన అధికారులు

అమరావతి: అంకితా భండారి (19) హత్య కేసు విషయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్రంగా స్పందించారు. వనతార రిసార్ట్‌ ను కూల్చేయాలని సీఎం ఆదేశించడంతో,అధికారులు బుల్డోజర్లతో పుల్కిత్ ఆర్యకు చెందిన రిసార్టును కూల్చేశారు.వివరాల్లోక వెళ్లితే… పుల్కిత్ ఆర్య ఉత్తరాఖండ్ మాజీ మంత్రి  వినోద్ ఆర్య కుమారుడు. రిషికేశ్‌లో వనతార పేరుతో రిసార్ట్‌ నడుపుతున్నాడు..అందులో అంకితా భండారి రిసెప్షనిస్టుగా పని చేస్తొంది. సెప్టెంబర్ 18వ తేదీన సాయంత్రం 6 గంటలు అయిన ఆమె ఇంటికి రాకపొవడంతో,అంకిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యను,మేనేజర్,అకౌంటెంట్ ను అరెస్ట్ చేశారు.తొలుత కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన పుల్కిత్ ఆర్యను, పొలీసులు తమదైన శైలీలో విచారించగా, ఓ వివాదం కారణంగా అంకితా భండారికి మద్యం తాగించి,చిల్లా కాలువలోకి తోసేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సెర్చ్ ఆపరేషన్  మొదలుపెట్టిన SDRF బృందాలు అంకితా భండారి మృతదేహన్ని బయటకు తీశారు. ఆ తర్వాత డెడ్ బాడీని రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు.

రాష్ట్రంలోని అన్ని రిసార్ట్‌ ల నిర్వాహకులను విచారించాలని జిల్లా మేజిస్ట్రేట్‌లకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. అక్రమంగా నిర్వహిస్తున్న రిసార్ట్‌లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కేసులో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి రేణుకాదేవి ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేసినట్లుగా సీఎం వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *