ఒకే దేశం-ఒకే పోలీస్ యూనిఫాం-ప్రధాని మోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకే దేశం-ఒకే పోలీస్ యూనిఫాం’ అని కొత్త ప్రతిపాదన చేశారు. శుక్రవారం హర్యానాలోని సూరజ్కుండులో ఏర్పాటు చేసిన చింతన్ శివిర్ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 16 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, హోం మంత్రులు,కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరైన ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. శాంతిభద్రతల పరిరక్షణ రాష్ట్రాల బాధ్యతే అయినప్పటికీ, దీనికి దేశ సమైక్యతో సంబంధం ఉందని అన్నారు. పోలీస్ వ్యవస్థ బాధ్యత పూర్తిగా రాష్ట్రాల పరివేక్ష్యణలో ఉండడం వల్ల, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనల మేరకు ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన పోలీస్ యూనిఫాం ఉంటుందన్నారు. అయితే ఇలా భిన్నంగా కాకుండా, దేశం మొత్తం పోలీసు వ్యవస్థకు ఒకే యూనిఫాం ఉండేలా చూస్తూ బాగుంటుందని ప్రధాని మోదీ సూచించారు.అలాగే రాష్ట్రాలు శాంతి భధ్రతల పరివేక్షణ,నేరా పరిశోధన గురించి ఒక రాష్ట్రం నుంచి మరొకటి నేర్చుకోవచ్చునని, పరస్పరం ప్రేరణ పొందవచ్చునని, కలిసికట్టుగా దేశ అభివృద్ధి కోసం పాటుపడవచ్చునని తెలిపారు.నేటి పరిస్థితుల్లో నేరాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయని, ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రాల పోలీస్ వ్యవస్థ మధ్య సమన్వయం అవసరమని మోదీ పిలుపునిచ్చారు. పోలీస్ వ్యవస్థలో ఒక ఉమ్మడి విధానం నెలకొంటే అంతర్రాష్ట్ర నేరాలను సులువుగా కట్టడి చేయవచ్చని అన్నారు.