AMARAVATHICRIME

పులివెందులలో తుపాకితో కాల్పులు ఒకరు మృతి

అమరావతి: కడపజిల్లా పులివెందులలో మంగళవారం చోటు చేసుకున్న కాల్పుల సంఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. మరొకరు మృతి చెందారు..వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భరత్‌ కుమార్ యాదవ్,,దిలీప్, మహబూబ్‌ బాషాపై కాల్పులు జరిపినట్లుగా పోలీసులు గుర్తించారు..ఆర్థిక లావాదేవీల విషయమై దిలీప్‌,,భరత్‌ కుమార్‌ యాదవ్‌ మధ్య తేడా రావడంతో వీరిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వివాదం చోటచేసుకుంది..ఓ స్థలంకు సంబంధించి ఆర్దిక వివాదంలో కాల్పులు జరిగినట్టుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ దిలీప్‌ను కడప రిమ్స్‌లో చికిత్స కోసం తరలించారు..దిలీప్ ఛాతీలో బుల్లెట్లు దిగడంతో వేంపల్లె ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు..మహబూబ్‌ బాషాకు చేతికి గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు..

ఓ స్థలం విషయంలో వివాదం దిలీప్‌-భరత్‌ కుమార్ యాదవ్ మధ్య కొంత కాలంగా వివాదం రాజుకోంటోంది. స్థానిక పెద్దలు సెటిల్మెంట్‌కి ప్రయత్నించినా రాజీ కుదరలేదని సమాచారం..రెండు వారాల క్రిందట దిలీప్‌ను భరత్ గన్‌తో బెదిరించినట్లు తెలియవచ్చింది..కేసు నమోదు చేసిన పోలీసులు భరత్‌ కుమార్ యాదవ్ నుంచి గన్‌ స్వాధీనం చేసుకోలేదని విమర్శలు వస్తున్నాయి..పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారించిన కారణంగానే నేడు ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నదని స్థానికులు మండిపడ్డుతున్నారు..

(పులివెందలలో రాజకీయంగా చక్రం తిప్పే వ్యక్తిగా భరత్‌ యాదవ్‌కు పేరుంది..YS వివేకానందా రెడ్డి హత్యా కేసులో CBI అధికారులు భరత్‌ యాదవ్‌ను ప్రశ్నించారు..హత్యా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్‌ యాదవ్‌ను వివేకానందారెడ్డికి పరిచయం చేసింది భరత్‌ యాదవేనని సమాచారం..వివేకా హత్యా కేసులో సునీల్‌ యాదవ్‌ A2గా ఉన్నాడు..అదే సమయంలో వివేకా హత్యా కేసులో తనను ఇరికించారని భరత్‌ యాదవ్‌ గతంలో సీబీఐ అధికారులపై ఆరోపణలు కూడా చేశారు..సునీల్‌ యాదవ్‌కు భరత్‌ సన్నిహిత బంధువు అని తెలుస్తొంది.)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *