కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

అమరావతి: రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి జరుగుతున్న పోలింగ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు ఓటు హాక్కును వినియోగించుకున్నారు..వివిధ రాష్ట్రాల్లోనూ పలువురు సీ.ఎంలు,ఎమ్మేల్యే,ఇతర ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు..ఓటు వేసేముందు మోదీ మీడియాతో మాట్లాడాతూ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్లమెంటు సమావేశాలు జరగడం మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయని చెప్పారు..ఇదే సమయంలో అజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నామని,,త్వరలో అగష్టు 15 వేడుకలు జరగనున్నాయని గుర్తుచేశారు..మరో 25 ఏళ్ళలో దేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుందని పేర్కొన్నారు..మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, దేశాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్ళడానికి తీర్మానాలు చేసుకోవాల్సిన సమయం అన్నారు..
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్,,ఆంధ్రప్రదేశ్ లో సీ.ఎం జగన్,,ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్,,తెలంగాణలో సీ.ఎం కే.సి.ఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు..సంబంధిత రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఓటు హాక్కును వినియోగించుకున్నారు..