AMARAVATHI

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామయ్య క‌ల్యాణం-భ‌క్తులంద‌రికి ముత్యంతో కూడిన త‌లంబ్రాల పంపిణీ

 కడప: కడపజిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జ‌రిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి  క‌ల్యాణోత్స‌వాన్ని తన్మయత్వంతో  తిల‌కించారు. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్నిరాత్రి 7 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. 8 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్‌ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని మయం చేసేందుకు పుణ్యాహవచనం నిర్వహించారు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం(కన్యావరణం), మధుపర్కార్చనం చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. రాములవారి వంశస్వరూపాన్ని స్తుతించారు. అగ్నిప్రతిష్టాపన తరువాత సీతా రాముల తల మీద జీలకర్ర, బెల్లం ఉంచి శాస్త్రోకంగా కల్యాణ వేడుక నిర్వహించారు. తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠించి, మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేప‌ట్టారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్త‌యింది.

భ‌క్తులంద‌రికి ముత్యంతో కూడిన త‌లంబ్రాల పంపిణీ:-కల్యాణవేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కూర్చుని శ్రీ సీతారాముల క‌ల్యాణాన్ని తిలకించేందుకు విచ్చేసిన భ‌క్తులంద‌రికి, శ్రీ‌వారి సేవ‌కులు ముత్యంతో కూడిన త‌లంబ్రాల‌ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, మంత్రులు కొట్టు.సత్యనారాయణ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

1 hour ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

20 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

21 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

1 day ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

This website uses cookies.