హైదరాబాద్ లో నేటి నుంచి “ఆపరేషన్ రోప్” ప్రారంభం

హైదరాబాద్: నగరంలో సోమవారం నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. పోలీసులు ప్రత్యేక “ఆపరేషన్ రోప్” డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. వాహనదారులు పక్కాగా నిబంధనలు పాటించేలా చర్యలు ప్రారంభించారు. వాహనదారులు నిబంధనలు మీరితే వెంటనే జరిమానా విధిస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద స్టాప్‌లైన్ దాటితే రూ.100,, ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగిస్తే రూ.1000,,పాదచారులకు ఇబ్బంది కలిగిస్తే రూ.600 జరిమానా విధించనున్నారు. దుకాణదారులు ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేయనున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అమలవుతున్న ఆపరేషన్ రోప్ ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ పరిశీలించారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనదారులకు కొత్త రూల్స్ గురించి అవగాహన కల్పించారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.