అత్యధిక పోక్సో నేరాలు జరిగిన 10 రాష్ట్రాల్లో,4 రాష్ట్రాలు దక్షిణదివే- ప్రియాంక కనోంగో

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్..
తిరుపతి: లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణకు సంబంధించి పోక్సో (POCSO) చట్టం ప్రపంచంలోనే ఒక ఆదర్శప్రాయమైన చట్టం అని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ (NCPCR ) చైర్‌పర్సన్ ప్రియాంక కనోంగో పేర్కొన్నారు..శనివారం స్థానిక ఎస్.వి.మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ,,చట్టం అమలు విధి విధానాల పై దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,తెలంగాణ,కేరళ,,కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి ప్రాంతీయ స్థాయి సమావేశంలో అయన మాట్లాడుతూ లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణకు సంబంధించి పోక్సో (POCSO) చట్టం ప్రపంచంలోనే ఒక ఆదర్శప్రాయమైన చట్టంమన్నారు..ఇది 0 నుంచి 18 సంవత్సరం లోపు పిల్లలపై లైంగిక నేరాలను నియంత్రించే లింగ తటస్థ చట్టం..
POCSOకి సంబంధించి 2020కి సంబంధించిన ఈ డేటా భారత ప్రభుత్వ న్యాయ శాఖ నుండి తీసుకోబడింది..2020- సంవత్సరంలో అత్యధిక పోక్సో నేరాలు జరిగిన 10 రాష్ట్రాల్లో-4 రాష్ట్రాలు దక్షిణ భారతదేశానికి చెందినవే అని,, తమిళనాడులో 3030 కేసులు, కేరళలో 2163 కేసులు, కర్ణాటకలో 2104 కేసులు, తెలంగాణలో 2074 కేసులు నమోదయ్యాయి..POCSO చట్టం ప్రపంచంలోని కఠినమైన చట్టంమైనప్పటికి, నేరారోపణ రేటు కూడా పిల్లలకు న్యాయం చేయడంలో ప్రభావంతంగా ఉండాలన్నారు..
POCSO చట్టం, 2012లోని సెక్షన్ 44 (1) కింద అందించబడిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ & POCSO రూల్స్ 2020లోని రూల్ 12 చట్టం అమలుకు సంబంధించి మానిటరింగ్ బాద్యత పాత్రను పోషిస్తోందని అన్నారు.
NCPCR ఇప్పటికే జిల్లా స్థాయి సంకలనాన్ని సిద్ధం చేసే పనిని ప్రారంభించింది.. జిల్లాల వారీగా సమాచారాన్ని సేకరిస్తుందని,, ఈ విషయంలో కమిషన్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA), నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ (NFSU), సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA), బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ (BPR & D) అలాగే రాష్ట్ర సహకారాన్ని కోరిందని తెలిపారు..