పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యంలో దేవాలంయం లాంటిది-రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

అమరావతి: పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యంలో దేవాలంయం లాంటిదని,,రాజకీయ పార్టీలు దేశ ప్రయోజనాల దృష్ట్యా పక్షపాత రాజకీయాలకు దూరంగా ఉండాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్షాంక్షించారు..శనివారం రాష్ట్రపతిగా అయన పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు..ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి,, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే హక్కు ప్రతిపక్షనేతలకు ఉందని,,అయితే దాని కోసం అందరూ గాంధేయవాదా పద్దతి అనుసరించాలని సూచించారు..రాష్ట్రపతిగా దేశానికి సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు..పార్లమెంట్ సభ్యులతో కూడిన పెద్ద కుటుంబంలో తాను ఒక భాగమని,,కుటుంబంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా దేశ ప్రయోజనాల కోసం అందరు పనిచేయాలని సూచించారు..