AMARAVATHIINTERNATIONAL

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19 మంది ప్రాణాలు కోల్పోయారు..మీడియాల కథనా ప్రకారం బుధవారం వేకువజామున 2:10 గంటల సమయంలో మీజౌ-డాబు కౌంటీ నగరాల మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది.. ఫైఓవర్ వంతెనపై ఉన్న రోడ్డులో కొంత భాగం కుప్పకూలిపోయింది.. ఆ సమయంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న 18 వాహనాలు అందులో అంత ఎత్తు నుంచి క్రింద పడిపోయాయి.. ఆ వాహనాల్లోని సుమారు 49 మంది తీవ్రంగా గాయపడ్డారు..సమాచారం అందుకున్న స్థానిక అధికారులు సిబ్బందితో వెంటనే సంఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.. కూలిపోయిన ప్రాంతం నుంచి వారిందరినీ బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.. వారిలో 19 మంది ప్రాణాలు కోల్పోగా,,దాదాపు 30 మంది ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు మీడియా వెల్లడించింది..ఆ ప్రాంతంలో ఇటీవలే చోటు చేసుకున్న వాతావరణ మార్పులు, వర్షాలు, వరదలు, సుడిగాలుల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకొని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు..సంఘటన చోటు చేసుకునేందుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు మీడియా తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *