ప్యాసింజర్,గూడ్స్ రైళ్లు ఢీ-49 మందికి గాయాలు

అమరావతి: మహారాష్ట్రలోని గోండియాలో బుధవారం వేకువజామున 2.30 గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న ప్యాసింజర్ రైలు,,గూడ్స్ రైలు ఢీ కొన్నాయి.. నాగ్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వెళ్తున్న భగత్ కి కోటి ఎక్స్‌ప్రెస్‌ను, గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది..నాగ్‌పూర్ వెళ్తున్న ఈ రెండు రైళ్లు సిగ్నల్స్ లో తలెత్తిన సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం..ప్రమాదం కారణంగా ప్యాసింజర్ రైలుకు సంబంధించి 3 బోగీలు పట్టాలు తప్పాయి.. దింతో ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తున్న దాదాపు 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.. గాయపడిన వారిలో 49 మంది ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు.. ఒకరికి మాత్రం తీవ్ర గాయాలైనట్లు సమాచారం..ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణానష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.