రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై #Good Morning CM Sir పోస్టు చేసిన పవన్ కళ్యాణ్

అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లో ప్రజా సమస్యల పరిష్కారం పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని,, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు లేవంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. గత కొద్దిరోజులుగా ఏపీలో రోడ్ల దుస్థితిపై పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చాలాచోట్ల రోడ్ల దుస్థితి మరింత దారుణంగా తయారైంది.. రోడ్డు ప్రయాణం ఎంత నరకంగా మారిందో తెలియచేసే వ్యంగ్య చిత్రాన్ని పవన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే రహదారిలో.. కొత్తపేట వద్ద అధ్వాన స్థితిలో ఉన్న రోడ్డు వీడియోను.. పోస్ట్ చేశారు..ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా #Good Morning CM Sir పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించారు..
#GoodMorningCMSir pic.twitter.com/9VYlpiQTT5
— Pawan Kalyan (@PawanKalyan) July 15, 2022