AMARAVATHIPOLITICS

వారాహిపై జూన్ 14 నుంచి పవన్ కల్యాణ్ యాత్ర ప్రారంభం

అమరావతి: జనసేనాని పవన్ కల్యాణ్ ‘వారాహి’యాత్ర త్వరలో ప్రారంభం కానున్నట్లు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్వయంగా వెల్లడించారు..శుక్రవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో గోదావరి జిల్లాల నేతలతో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు..అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ  జూన్ 14 నుంచి వారాహిపై పవన్ కల్యాణ్ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారని,, తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో  రత్నగిరిపై కొలువైన  సత్యనారాయణ స్వామి సన్నిధిలో వారాహికి పూజలు చేయించి స్వామివారిని పవన్ కల్యాణ్ దర్శించుకుని యాత్రను ప్రారంభించనున్నారని మనోహర్ తెలిపారు.. పవన్ వారాహి యాత్ర ఒకే విడతగా కాకుండా పలు విడతలుగా చేయనున్నారన్నారు.. ఇందులో భాగంగా మొదటి విడత అన్నవరం నుంచి భీమవరం వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు..ఈ యాత్ర ద్వారా పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని తెలిపారు..మహిళలు, రైతులు, యువత సమస్యల్ని తెలుసుకుంటారని..ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకే వారాహి యాత్ర అని తెలిపారు..రాష్ట్ర క్షేమం కోసం పవన్ చేసే ఈ యాత్ర ఉపయోగపడుతుందని,,యాత్రలో భాగంగా అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని,, స్థానిక సమస్యల పరిష్కార మార్గాల కోసం కృషి చేయనున్నారని మనోహర్ తెలిపారు.

ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని,,పీఠాపురం,,కాకినాడ రూరల్,,కాకినాడ ఆర్బన్,,ఉమ్మడివరం,,ఆమలపురం,,బి.గన్నవరం,, రాజోలు,,నరసాపురం,,భీమవరం,,పాలకొల్లులో కొనసాగుతుందన్నారు..భీమవరం తరువాత స్థానిక నాయకులతో సంప్రదించి యాత్ర కొనసాగింపుపై నిర్ణయం తీసుకొవడం జరుగుతుందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *