x
Close
MOVIE

మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపిన పవన్

మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపిన పవన్
  • PublishedAugust 22, 2022

అమరావతి: నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా చిన్న తమ్ముడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు..తెలుగు భాషలో తనకు ఇష్టమైన పదం అన్నయ్య అంటూ ట్వీట్ చేశారు..దోసెడు సంపాదిస్తే.. గుప్పెడు దానం చేయాలనే చిరంజీవి జీవన విధానాన్ని ఎంత పొగిడినా తక్కువేనని తెలిపారు..ప్రతి నమస్కారం కూడా చేయలేని కుసంస్కారికి కూడా చేతులెత్తి నమస్కరించే సంస్కారం చిరంజీవి సొంతమన్నారు..అలాంటి సుగుణాలున్న అన్నయ్యకు తమ్ముణ్ణి కావడం పూర్వ జన్మ సుకృతమని ట్వీట్‌ లో పేర్కొన్నారు..ఆయన సాధించిన విజయాలు, ఆయన కీర్తిప్రతిష్ఠలు, ఆయన సేవాతత్పరత గురించి తెలుగువారితోపాటు యావత్‌ భారత్‌కీ తెలుసు. అన్నయ్యలోని గొప్ప మానవతావాది గురించి చెప్పడమే నాకు ఇష్టం. ఆయన జీవన విధానాన్ని ఎంత పొగిడినా తక్కువే. చెమటను ధారగా పోసి సంపాదించిన దాంట్లోంచి ఎందరికో సాయం చేశారు. పేదరికంతో బాధపడుతున్న, అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన, చదువుకు దూరమైన వారి గురించి తెలియగానే తక్షణమే స్పందించి సహాయం చేసే సహృదయుడు అన్నయ్య.అందరినీ అక్కున చేర్చుకునే విశాల హృదయుడు,అలాంటి సుగుణాలున్న అన్నయ్యకు నేను తమ్ముణ్ణి కావటం నా పూర్వజన్మ సుకృతం. ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని,నాకు తల్లిలాంటి మా వదినమ్మ సహచర్యంలో ఆయన నిండు నూరేళ్లు చిరాయువుగా వర్థిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. అన్న రూపంలో ఉన్న మా నాన్నకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా అని అన్నారు.మెగాస్టార్ గా సినీ ప్రేక్షక హృదయాలలో స్థిరపడిన నటులు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం. మీరు నిండు నూరేళ్లూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.