ఎన్జీటీ విధించిన 4.38 కోట్ల నష్టపరిహరం వెంటనే చెల్లించండి-సుప్రీమ్

అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పురుషోత్తమపట్నం రూ.2.48 కోట్లు,, పట్టిసీమ రూ.1.90 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలంటు నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ (NGT) విధించిన జరిమానను వెంటనే జమ చేయాలని ఏపీ ప్రభుత్వంను సుప్రీమ్ కోర్టు ఆదేశించింది. NGT తీర్పులోని ఇతర అంశాలను యధాతథగా అమలు చేయాలని, కేవలం నష్ట పరిహారం అంశంపై మాత్రమే విచారణను కొనసాగిస్తామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం తెలిపింది. పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో పర్యావరణ ఉల్లంఘనలు ఉన్నాయని ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ తెలిపింది.ఇందుకు భారీగా జరిమానాలను విధించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.