డబ్బు కట్టండి-మంత్రి గోవర్దన్ రెడ్డి,మాజీ మంత్రి అనిల్ కు వేధింపులు

నెల్లూరు: లోన్ యాప్ నిర్వహకుల సెగ వ్యవసాయశాఖ మంత్రి గోవర్దన్ రెడ్డి,,మాజీ మంత్రి అనిల్ కుమార్ లకు తగిలింది..మంత్రి గోవర్దన్ రెడ్డికి నెంబర్‌కు 79 సార్లు ఫోన్ చేయాగా,,ఎందుకు ఫోన్ చేశారనే విషయంపై ఎంక్వరీ చేస్తే,,లోన్ తీసుకున్న అశోక్‌కుమార్,,నా నెంబర్ ప్రత్యామ్నాయంగా ఇచ్చారని,,అందుకే ఫోన్ చేస్తున్నామని కాలర్స్ చెప్పారు..ఈ విషయంపై నెల్లూరు ఎస్పీకి తెలిపడం జరిగిందని మీడియాకు మంత్రి తెలిపారు..ఎస్పీ ఈ విషయంపై వివరాలు సేకరించి నలుగురిని అరెస్టు చేశారు..వీరిని విడిపించేందుకు 10మంది ప్రముఖ న్యాయవాదులు రావడం ఆశ్చర్యంగా ఉంది..లోన్‌యాప్ ముఠాను పట్టుకునేందుకు,,పోలీసుల విచారణలో భాగంగా మా పీఏ నుంచి రూ.25వేలు చెల్లించారు. లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులకు హద్దు లేకుండాపోతుంది,,వీరి ఆగడాలు భరించలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,, మంత్రిగా ఉన్న తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆలోచించి డిజీపీ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని కాకాణి తెలిపారు..
మాజీ మంత్రి అనిల్‌కి వేధింపులు:-మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు రుణయాప్‌ల వేధింపులు తప్పలేదు… ఫ్లట్రన్ రుణయాప్ నుంచి అనిల్ కుమార్ కు ఫోన్ వచ్చింది…మీ బావమరిది రుణం తీసుకున్నారని ప్రియాంక తన పేరు అంటు మహిళ కాల్ చేసింది..తనకు బావమరిది లేరని అనిల్ చెప్పినా మహిళ వినిపించుకోలేదు…ఈ ఘటనపై ఐజీకి ఫిర్యాదు చేసినట్లు అనిల్ తెలిపారు…