ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి-ప్రధాని మోదీ

మన్ కీ బాత్…
అమరావతి: చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, అమెరికాతో సహా పలు ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత సమయంలో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు..ఆదివారం 2022 చివరి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను సెలబ్రేట్ చేసుకునేందుకు చాలామంది వెకేషన్‌కు వెళ్తుంటారని, కరోనా బారిన పడకుండా వారంతా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు..మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం, భౌతికదూరం వంటి ప్రొటోకాల్స్ ను పాటించాలని కోరారు..ప్రభుత్వం ఆప్రమత్తంగా వుంటూ తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు..ముఖ్యంగా జీరో-కోవిడ్ పాలసీని చైనా తీసివేయడంతో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలతో ముందుకు వెళ్తోందని వెల్లడించారు..భారతదేశం 220 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ డోస్‌లు ప్రజలకు ఇవ్వడం ద్వారా ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించిందని,, గ్లోబల్ ఎకానమీలో ఐదో స్థానంలో నిలిచిందని ప్రధాని అన్నారు..ఎగుమతుల విషయంలోనూ 400 బిలియన్ డాలర్ల విలువచేసే మేజికల్ ఫిగర్‌ను సాధించిందని చెప్పారు..అంతరిక్ష,,రక్షణ,, డ్రోన్ రంగాల్లో కొత్త పుంతలు తొక్కిందని,, క్రీడల్లోనూ విజయాలను సొంతం చేసుకున్నామన్నారు..