విగ్రహాల ఏర్పాటుకు కార్పొరేషన్ లో అనుమతి కేంద్రం-కమిషనర్ హరిత

నెల్లూరు: ఈనెల 31 వ తేదీ నుంచి జరగనున్న వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనం కార్యక్రమాలకై ముందస్తు అనుమతులు తప్పనిసరి అని, కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అనుమతి కేంద్రంలో వివరాలు నమోదు చేసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత తెలిపారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన అనుమతుల కేంద్రాన్ని నగర పాలక సంస్థ మేయర్ స్రవంతితో కలిసి కమిషనర్ సోమవారం పరిశీలించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా వివిధ కూడళ్లలో ఏర్పాటు చేస్తున్న విగ్రహ ప్రతిష్టాపనకోసం కార్యాలయంలోని విజిటర్స్ లాంజ్ లో ఏర్పాటు చేసిన సింగిల్ విండో కేంద్రంలో అధికారుల వద్ద వివరాలు నమోదు చేసి అనుమతులు పొందాలని సూచించారు. ప్రత్యేక అనుమతుల కేంద్రం అధికారులుగా సంజయ్, రాజేశ్వరిలను నియమించినట్లు కమిషనర్ పేర్కొన్నారు.