AMARAVATHI

ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ కు అనుమతులు తప్పనిసరి-ఎన్నికల సంఘం

అమరావతి: రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం కఠినంగా హెచ్చరించింది..ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ అనూజ్ చండక్ బుధవారం ప్రకటన విడుదల చేశారు.. అభ్యర్థుల ప్రచార ఖర్చును అంచనా వేయడానికి హోర్డింగ్స్‌ పై ప్రచురణ కర్తల పేర్లు తప్పనిసరిగా ముద్రించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.. ఇటీవల కాలంలో ప్రచురణ కర్తల పేర్లు లేకుండా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన బ్యానర్లు, హోర్డింగ్స్ ఎక్కువుగా ఏర్పాటు చేస్తున్నారు..దింతో రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం, ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలి ప్రాంతాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది..అలాగే ఎన్నికల సంబంధిత సామాగ్రి, హోర్డింగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఈసీ సూచించింది.. ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్, జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనూజ్ చండక్ వెల్లడించారు.. ప్రజాప్రతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల ప్రచారంతో సంబంధం ఉన్న కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లకార్డులు, బ్యానర్లపై ప్రచురుణ కర్త పేరు లేకుండా ముద్రించడానికి వీలులేదన్నారు..అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఖర్చుతో రాజకీయ ప్రకటనలు ఇవ్వరాదని తెలిపారు.. ప్రతి రాజకీయ పార్టీ తమ ప్రకటనలను ముందుగానే సర్టిఫికిషేన్ చేయించుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు సూచించారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

3 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

5 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

8 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

9 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

12 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.