అమరావతి: దసరా ఉత్సవాల్లో భారీ హింసకు PFI కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల దర్యాప్తులో బయటపడింది. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే, BJP,RSS నేతలే టార్గెట్‌గా ప్రణాళికలు రచించినట్లు సమాచారం. మహారాష్ట్ర ATS పోలీస్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగ్‌పూర్ RSS కార్యాలయం పరిసర ప్రాంతాల్లో PFI రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది.PFI హిట్ లిస్టులో దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు సైతం ఉన్నట్టు సమాచారం. BJP, RSS నేతలను ఏజెన్సీలు అప్రమత్తం చేశాయి. సంబంధిత కార్యాలయాల వద్ద పటిష్టమైన భద్రతను కల్పించారు.