ప్రధానమంత్రి నరేంద్రమోదీని హతమార్చేందుకు PFI కుట్ర

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీని హతమార్చేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర పన్నిందని తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (NIA) దర్యాప్తులో బయటపడింది.PFI కార్యాలయాలు,సంస్థ నేతల ఇళ్లపై ఇటీవల NIA,ED చేసిన దాడుల్లో ఈ విషయం వెలుగుచూసింది. ఈ సంవత్సరం జులై 12వ తేదిన ప్రధాని మోదీ పాట్నా పర్యటన సందర్భంగా PFI సభ్యులు దాడికి విఫలయత్నం చేశారని దర్యాప్తులో తేలింది. ప్రధానిపై దాడి చేసేందుకు PFI పలువురు యువకులకు శిక్షణ కూడా ఇచ్చారని వెల్లడైంది. ప్రధానితోపాటు యూపీలోని పలువురు ప్రముఖులపై దాడికి PFI మారణాయుధాలు కూడా సమకూర్చుకున్నారని తేలింది. NIA, ED లు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, PFIలో క్రీయాశీలకంగా వున్న దాదాపు 100 మంది నేతలను అరెస్ట్ చేసింది.ఈ ఏడాది జులై 12వ తేదీన పాట్నాలో బీజేపీ ర్యాలీ సందర్భంగా PFI నేత షఫీక్ పైత్, మోదీ హత్యకు పథకం రూపొందించారని తెలిసింది. ED జరిపిన సోదాల్లో గత కొన్నేళ్లుగా PFIకు సంబంధించిన సంస్థల బ్యాంకు ఖాతాల్లో రూ.120 కోట్లకు పైగా నగదు జమ అయినట్లు బయటపడింది.ప్రజల్లో మతవిధ్వేషలు రెచ్చకొట్టి, మత సామరస్యానికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో PFI సభ్యులు హత్రాస్‌కు వెళ్లారని దర్యాప్తులో వెల్లడైంది. మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టడం, భయాందోళనలు సృష్టించడం, ఉగ్రవాద ముఠా ఏర్పాటుకు ప్లాన్ చేయడం, మారణాయుధాలు, పేలుడు పదార్థాల సేకరణ, సున్నితమైన ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేయడంలో PFI తన కార్యకర్తలతో కలసి పాలుపంచుకున్నట్లు ఆధారాలు కూడా కేంద్ర దర్యప్తు సంస్థలకు అందాయి. మతవిధ్వేషలు రెచ్చకొడుతున్న PFI సంస్థను నిషేధించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ యోచిస్తున్నట్లు తెలుస్తొంది.