అమరావతి: కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ క్యాంపు కార్యాలయంలోని ల్యాండ్ లైన్ కు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు చంపుతామని హెచ్చరికలు జారీ చేశారు..ఫోన్ కాల్స్ ను రిసీవ్ చేసుకున్న నితిన్ గడ్కరీ కార్యాలయం సిబ్బంది నాగర్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..మూడు సార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది వెల్లడించారు..ఉదయం 11.29 గంటలకు, 11:35 గంటలకు, మధ్యాహ్నం 12. 32 గంటలకు ఈ బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయని ఫిర్యాదు పేర్కొన్నారు.. గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపుకాల్ చేసిన సమయంలో దావూద్ ఇబ్రహీంను పేరును సూచిస్తూ మాట్లాడారని తెలిపారు..ఫిర్యాదు అందినవెంటనే పోలీసులు, ఉన్నతాధికారులు గడ్కరీ కార్యాలయానికి చేరుకొని విచారణ చేపట్టారు..గడ్కరీ ప్రస్తుతం నాగపూర్ లోనే ఉన్నారని, ఆయన క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.. గడ్కరీ క్యాంప్ కార్యాలయం నాగపూర్‌లోని ఖమ్లాచౌక్‌లో ఉంటుంది..