రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్,ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఫోన్ సంభాషణ

అమరావతి: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య శుక్రవారం ఫోన్ సంభాషణ జరిగిందని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. సెప్టెంబరు 16వ తేదిన ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన SCO శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ లు సమావేశమయ్యారు. సమర్‌కండ్‌లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు ఇంధన సహకారం, వాణిజ్యం,పెట్టుబడులు, రక్షణ, భద్రతా సహకారం, ఇతర కీలక రంగాలతో సహా ద్వైపాక్షిక సంబంధాల వంటి అనేక అంశాలను సమీక్షించారు.G-20కి భారత్ ప్రస్తుత ఛైర్మన్‌షిప్ గురించి ప్రధాని మోదీ అధ్యక్షుడు పుతిన్‌కు వివరించినట్లుగా తెలుస్తోంది. సమావేశాల ప్రాధాన్యతలను హైలైట్ చేశారని PMO తెలిపింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌కు భారతదేశం ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వారు ఒకరితో ఒకరు నిరంతరం సంప్రదించడానికి అంగీకరించారని పేర్కొన్నారు.