సెంటర్- స్టేట్ సైన్స్ కాన్‌క్లేవ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: సెంటర్-స్టేట్ సైన్స్ కాన్ క్లేవ్ ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అహ్మదాబాద్‌లోని సైన్స్ సిటీలో రెండు రోజుల పాటు ఈ కాన్‌క్లేవ్ జరగనున్నది..తొలి సారిగా సెంటర్-స్టేట్ సైన్స్ కాన్ క్లేవ్ అనే పేరుతో ఈ సారి ఈ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నారు..ఈ కాన్‌క్లేవ్‌లో జార్ఖండ్,,బిహార్ రాష్ట్రాలు తప్ప మిగిలిన రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి..ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ ఈ కాన్‌క్లేవ్ ద్వారా పరిశ్రమలు,, యువ శాస్త్రవేత్తలు,,ఆవిష్కర్తలు సద్వినియోగం చేసుకొవచ్చాన్నారు..భారతదేశం 4వ పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం వహిస్తుందని,, భారతదేశ సైన్స్ అభివృద్ధికి,, ఈ రంగానికి సంబంధించిన వ్యక్తుల పాత్ర చాలా ముఖ్యమైనదన్నారు..మన శాస్త్రవేత్తల విజయాలను మనం తెలుసుకోవాలని,,వారి ఆవిష్కరణలను తెలుసుకున్నప్పుడే సైన్స్, మన సంస్కృతిలో భాగమవుతుందని ప్రధాని పేర్కొన్నారు..సైన్స్ ఆధారిత అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తొందని తెలిపారు..2014 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీలో పెట్టుబడులు పెరిగాయని,,ప్రభుత్వ తీసుకున్న చర్యలు కారణంగా,, భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 2015లో 81వ స్థానంలో వుండగా,ప్రస్తుతం 46వ స్థానానికి చేరుకుందని తెలిపారు..నేటి యువత సాంకేతిక పరిజ్ఞానంను వేగంగా అందిపుచ్చుకుంటున్నరని అన్నారు..ఈ అమృత్ కాల్‌లో మనం భారతదేశాన్ని పరిశోధన,, ఆవిష్కరణలతో ప్రపంచనికే కేంద్రంగా మార్చాలని యువతకు పిలుపునిచ్చారు.