బీజెపీ నేత అద్వానీకి పుట్టినరోజు శుభకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

అమరావతి: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్.కె. అద్వాని మంగళవారం 95వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ అద్వాని నివాసానికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్చం అందించి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ వెంట కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్‌సింగ్ ఉన్నారు. అద్వాని నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీకి అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని అద్వానీ వద్దకు వెళ్లి పుష్పగుచ్చం అందించారు.అనంతరం మోదీ, రాజ్ నాథ్ సింగ్, అద్వానీలు కొద్దిసేపు ముచ్చటించారు.