ఏపీ జెన్కో వద్ద రిలే నిరాహార దీక్షను అడ్డుకున్న పోలీసులు-మోహన్ రావు

భారీగా నిరసన ర్యాలీ..
నెల్లూరు: ఏపీ జెన్కో వద్ద 180 రోజులుగా జరుగుతున్న నిరసనలో భాగంగా సోమవారం ఏపీ జెన్కో గేటు వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించేందుకు కార్మికులు సిద్దకావడంతో భారీగా పోలీసులు మోహరించి రిలే నిరాహార దీక్షలు అడ్డుకున్నారు..అందుకు నిరసనగా ఏపీ జెన్కో జేఏసీ మరియు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులు నల్ల బ్యానర్ చేపట్టి, మూతికి నల్ల రిబ్బన్లు కట్టుకొని భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏపీ జెన్కో మేనేజ్మెంట్,, ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు..పరిరక్షణ కమిటీ కన్వీనర్ మోహన్ రావు మాట్లాడుతూ శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు పూనుకుంటే, దీక్షలను అడ్డుకోవడం సిగ్గుచేటని, ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించడమేనని విమర్శించారు. పోలీసు నిర్బంధము ద్వారా ఉద్యమాన్ని అణిచివేయలేరని, ఏపీ జెన్కో పోరాటాన్ని వివిధ దశలలో ఉదృతం చేస్తామని తెలియజేశారు. మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి, కలెక్టరేట్ వద్ద దీక్షలు,మహా పాదయాత్ర నిర్వహించి తీరుతామని,ఏపీ జెన్కో ముట్టడికి సైతం వెనకాడేది లేదని తెలియజేశారు.