ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని

అమరావతి: సినీ కథ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది.ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని,అపాయింట్ మెంట్, ఇతర నియమ నిబంధనల వివరాలు ప్రత్యేకంగా వెల్లడిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది.రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీకి మద్దతు ప్రకటించి గత ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించిన పోసానికి ఎట్టకేలకు ప్రభుత్వం పదవిని కట్టబెట్టింది.కొద్ది రోజుల క్రితం హాస్య నటుడు అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించిన ప్రభుత్వం ఇవాళ పోసాని కృష్ణమురళికి కూడా పదవి కట్టబెట్టింది.