నేతాజీ సుభాష్ చంద్రబోస్ శౌర్యపరాక్రమానికి మారుపేరు-ప్రధాని మోదీ

126వ జయంతి..
అమరావతి: బ్రిటీషర్స్ ను గజ గజలాడించిన స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ 126వ జయంతి సదర్బంగా సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనంగా నివాళులర్పించారు..ఈ సందర్భంను పురస్కరించుకుని ప్రధాని మోడీ ఓ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేశారు..నేతాజీ సుభాష్ చంద్రబోస్ శౌర్యపరాక్రమానికి ఒక కర్మయోగి జీవితకాల భక్తుడు అంటూ సోషల్ మీడియా మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ వేదికగా మోడీ ఆర్కైవ్స్ ద్వారా విడుదల చేశారు..ఈ వీడియోలో ప్రధాని మోడీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు..దేశంలో యువతతో పాటు అందరికి స్ఫూర్తి ప్రదాత అంటూ కొనియాడారు..తనకు రాజకీయ మార్గదర్శకుడని పేర్కొన్నారు..తన జీవితం మొత్తం సుభాస్ చంద్రబోస్ అంకితం అంటూ ప్రధాని మోడీ వివరించారు.. యువ కార్యకర్త నాటి నుంచి సుభాస్ చంద్రబోస్‌ని ఎంతలా ఆరాధించేవారో కూడా అందులో తెలియ చేశారు..ఆకాలంలో డైరీలో రాసిన పలు సూక్తులను చూపించారు..అలాగే సుభాస్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం పరాక్రమ్ దివస్ గా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా చూపించారు..కర్తవ్యపథ్ ప్రారంభోత్సవం, తీసుకున్న పలు నిర్ణయాల గురించి దీనిలో స్పష్టంగా వెల్లడించారు.
Today, on Parakram Diwas, I pay homage to Netaji Subhas Chandra Bose and recall his unparalleled contribution to India’s history. He will be remembered for his fierce resistance to colonial rule. Deeply influenced by his thoughts, we are working to realise his vision for India.
— Narendra Modi (@narendramodi) January 23, 2023