అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ప్రయాణిస్తున్నకారు ప్రమాదానికి గురైయింది. కర్ణాటకలోని మైసూర్, కడకోలా సమీపంలో మంగళవారం మధ్యహ్నం 1.30 నిమిషాలకు రోడ్డు డివైడర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఘటన జరిగిన సమయంలో కారులో ప్రహ్లాద్ మోదీ డ్రైవింగ్ చేస్తుండగా,అయనతో పాటు కొడుకు, కోడలు, మనవడు కూడా ఉన్నారు..వీరు మెర్సిడెస్ బెంజ్ కారులో బెంగళూరు నుంచి బందీపూర్ వెళ్తున్న సమయంలో కారు ప్రమాదం జరిగింది. ఫలితంగా ప్రహ్లాద్ మోదీకి, ఆయన కోడలు, మనవడికి స్వల్ప గాయలయ్యాయి..విషయం తెలుసుకున్న మైసూర్ ఎస్పీ సీమా లట్కర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని,,చికిత్స కోసం క్షతగాత్రులను వెంటనే మైసూరులోని JSS ఆస్పత్రికి తరలించారు. మైసూరు తాలూకాలోని కడకోలా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.