AMARAVATHI

మీ పార్టీ ఆ 40 సీట్లును కాపాడుకోవాలని ప్రార్థిస్తున్నా-ప్రధాని మోదీ

బ్రిటీష్ కాలం నాటి బానిస భావజలం..
అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుకుపడ్డారు..ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నించినట్లు,,కాంగ్రెస్ పార్టీ BJPపై అసత్యప్రచారం చేసిందన్నారు.. తానూ స్వతంత్ర భారతంలో జన్మించానని,, తన ఆలోచనలు కూడా స్వతంత్రంగానే ఉంటాయన్నారు..బానిస మనస్సత్వతానికి పూర్తిగా వ్యతిరేకం అని స్పష్టం చేశారు..BSNL, HAL, MTNL,Air India విమాన సంస్థలను కాంగ్రెస్ నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ప్రధాని ఆరోపించారు..తమ ప్రభుత్వ హయాంలో BSNLకు చేయుతనిచ్చి 5G కూడా తీసుకొచ్చామన్నారు..HAL కూడా లాభాల్లో నడుస్తోందన్నారు.. LIC మూతపడుతుందని కాంగ్రెస్ పుకార్లు పుట్టించిందని,,అయితే నేడు LIC షేర్ ధర రికార్డ్ స్థాయిలో ఉందని లెక్కలతో సహా వివరించారు..కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు రూ.9 లక్షల కోట్లు వుండగా ప్రస్తుతం రూ.75 లక్షల కోట్లకు పెంచామని తెలిపారు..కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ నుంచి ఛాలెంజ్ వచ్చిందన్నారు.. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా దాటవని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారని,, మీ పార్టీ ఆ 40 సీట్లును కాపాడుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.. కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే చాలా సుదీర్ఘంగా మాట్లాడారని, అంత సమయం ఆయన ఎలా మాట్లాడారని ఆలోచించానన్నారు..వారి పార్టీకి సంబంధించిన ఇద్దరు కమాండర్లు లేరని,,ఈ ఆవకాశంను ఆయన అడ్వాంటేజ్ తీసుకున్నట్లు గుర్తించానన్నారు..
బ్రిటీష్ కాలం నాటి బానిస భావజలం:- కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని,,పత్రికా స్వేచ్ఛను మంటగిలిపిందని విరుచుకుపడ్డారు.. ఉత్తరం,, దక్షిణం పేరుతో దేశ ప్రజల్ని విడదీస్తోందన్నారు.. విపక్ష పార్టీల దుస్థతికి కాంగ్రెస్ పార్టీయే కారణం అని,, ఫెడరలిజం గురించి కాంగ్రెస్ పార్టీ ప్రవచనాలు చెబుతుందని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.. భారీ స్థాయిలో భారత భూభాగాన్ని అప్పటి ప్రధానమంత్రి నెహ్రు, శత్రు దేశాలకు అప్పగించిందని విమర్శించారు.. కాంగ్రెస్ వి అన్నీ బ్రిటీష్ కాలం నాటి బానిస భావజలంను,దేశ ప్రజలపై రుద్దిందని మండిపడ్డారు..రాజ్ పథ్ ను కర్తవ్ పథ్ గా మర్చలేకపోయిందని విమర్శించారు..కాంగ్రెస్ పార్టీకి స్టార్టప్ లాగా యువరాజు రాహుల్ నడిపిస్తున్నారని,, అయితే ఆ కంపెనీ ఎంతకీ స్టార్ట్ అవడం లేదని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

4 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

18 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

24 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 days ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

2 days ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

2 days ago

This website uses cookies.