AMARAVATHIDISTRICTS

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై కఠినమైన నిషేధం ఉంది.. అక్కడికి వెళ్లి తిరిగి వచ్చే బదులు మీ మొబైల్‌ని మీ వెంట తీసుకెళ్లకండి. 2) మీరు కుటుంబ సమేతంగా వెళుతున్నప్పటికీ, ఒకరు మొబైల్ ఫోన్‌ను చూసుకుంటూ బయట కూర్చోవలసి ఉంటుంది. 3) దయచేసి ఓటు వేసేటప్పుడు దయచేసి స్లిప్ కనిపించే వరకు (అంటే 4 సెకన్లు) బటన్‌ను నొక్కి ఉంచండి. ఒక బీప్ ధ్వనిస్తుంది.4) EVM మెషీన్‌లోని బటన్‌ను నొక్కినప్పుడు, VVPAT స్లిప్ బయటకు వచ్చే వరకు బటన్ నుండి వేలిని తీసివేయకూడదని గుర్తుంచుకోండి.5) VVPAT స్లిప్‌తో మీ ఓటును నిర్ధారించారని నిర్ధారించుకోండి.మీకు ఏదైన అనుమాలు వుంటే పోలింగ్ బూత్ లో వున్నా అధికారిని విరాలు అడిగి తెలుకోండి..

  1. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన వెంట‌నే మొద‌టి అధికారి త‌న వ‌ద్ద ఉన్న ఓట‌ర్ల జాబితాలో మీ పేరు, సంబంధిత వివ‌రాలు ప‌రిశీలిస్తారు. రాజకీయ పార్టీల ఏజంట్స్ కూడా మీ వివరాలను సరిచూసుకుంటారు. అన్ని వివ‌రాలు స‌రిగ్గా ఉంటే త‌ర్వాత రెండో అధికారి వ‌ర‌కు పంపిస్తారు.
  2. రెండో అధికారి త‌న వ‌ద్ద ఉన్న సిరాను మీ చూపుడు వేలికి అంటిస్తారు. దీనితో పాటు లిస్టులో ఉన్న మీ పేరుకు సంబంధించిన ఒక స్లిప్ ను మీకు అందిస్తారు.
  3. అక్క‌డి నుంచి రెండో అధికారి మిమ్మ‌ల్ని మూడో అధికారి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌మ‌ని చెబుతారు. మూడో అధికారి మీ వ‌ద్ద ఉన్న స్లిప్ ను ప‌రిశీలించి అన్ని వివ‌రాలు స‌రిగ్గా ఉంటే ఓటు వేసే ప్రాంత‌మైన ఈవీఎం ద‌గ్గ‌ర‌కు పంపుతారు.
  4. EVMలో అభ్య‌ర్థుల పేర్లు, ఫొటో, వారికి సంబంధించి గుర్తులు ఉంటాయి. వాటికి ఎదురుగా బ‌ట‌న్స్ ఉంటాయి. మీరు ఓటు వేయాల‌నుకున్న వ్య‌క్తి లేదా పార్టీ, గుర్తుకు ఎదురుగా ఉన్న బ‌ట‌న్ నొక్కి మీ ఓటును వేయాలి.
  5. ఈవీఎం బ‌ట‌న్ నొక్క‌గానే ఆ బ‌ట‌న్ లోని లైట్ వెలుగుతుంది. అలాగే, బీప్ అని ఒక శ‌బ్ధం వ‌స్తుంది. దీంతో ప‌క్క‌నే ఉన్న VVPATలో మీరు ఓటువేసిన గుర్తుకు సంబంధించి వివ‌రాల‌తో ఒక స్లిప్ 7 సెకండ్ల పాటు క‌నిపించి కింద‌ప‌డి పోతుంది.
  6. మీరు ఓటు వేయ‌డానికి వెళ్లిన‌ప్పుడు EVM బ‌ట‌న్ నొక్క‌గానే బీప్ అని సౌండ్ రాక‌పోయినా, బ‌ట‌న్ లైట్ వెలుగ‌క‌పోయినా, VVPATలో మీ ఓటుకు సంబంధించిన స్లిప్ రాక‌పోయిన అక్క‌డే ఉన్న అధికారికి వెంట‌నే స‌మాచారం అందించాలి.

ఎపిక్ కార్డు లేని ఓటర్లు 13 రకాల గుర్తింపు పత్రాల లో ఏదైనా ఒకటి చూపించవచ్చు.

నెల్లూరు: సాధారణ సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా పోలింగ్ రోజు ఎ పిక్ కార్డు లేని ఓటర్లు 13 రకాల గుర్తింపు పత్రాలు:-  

1 ఓటరు గుర్తింపు కార్డు

2 ఆధార్ కార్డు,

3 జాబ్ కార్డు,

4 బ్యాంక్ పాస్ పుస్తకం,

5 హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్,

6 డ్రైవింగ్ లైసెన్స్,

7 పాన్ కార్డు,

8 కార్మిక శాఖ వారి స్మార్ట్ కార్డు

9 పాస్పోర్ట్,

10 ఫోటో కలిగిన పెన్షన్ డాక్యుమెంట్,

11 సర్వీస్ ఐడి కార్డు,

12 అధికారిక గుర్తింపు కార్డు,

13 యూనిక్ డిసిబిలిటీ ఐడి

పై తెలిపిన ఐడీలలో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని  జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ తెలియజేశారు. ఓటర్ సమాచారం స్లిప్పులు మరియు e-EPIC పోలింగ్ స్టేషన్ లో గుర్తింపు ప్రూఫ్ గా ఉపయోగించకూడదు. పోలింగ్ బూత్ లోనికి సెల్ ఫోన్స్ గాని ఎలక్ట్రానిక్ పరికరాలను కానీ అనుమతించబడవని తెలియజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *