శ్రీశైలో రూ.43.08 కోట్ల అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేసిన రాష్ట్రపతి ద్రౌపదిముర్ము

అమరావతి: శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో నంది సర్కిల్ సమీపంలోని టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్ లో 43.08 కోట్ల రూపాయతో చేపట్టిన ప్రసాద్ ప్రాజెక్ట్ ను రిబ్బన్ కట్ చేసి శిలాఫలాకాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము,, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలై సాయి సౌందరాజన్ ఆవిష్కరించారు..సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి చాఫర్ లో సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకున్నారు. భారత రాష్ట్రపతికి, తెలంగాణా గవర్నర్ తమిళసై, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన,కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి,అధికారులు ఘన స్వాగతం పలికారు.. శ్రీశైలంలో యాత్రికుల సదుపాయాల కేంద్రం, హటకేశ్వరం, శిఖరేశ్వరంలలో ఎమినీటిస్ సెంటర్, శిఖరేశ్వరంలో పుష్కరిణి పునరుద్ధరణ, ఆలయంలో కళాత్మక విద్యుద్దీకరణ, బస్టాండ్ నుంచి పాతాళ గంగ వరకు కృష్ణవేణి రోడ్డు నిర్మాణం, యాంఫీథియేటర్, ఇల్యూమినేషన్స్,,సౌండ్ అండ్ లైట్ షో, డిజిటల్ ఇంటర్‌వెన్షన్, పార్కింగ్ ఏరియా, టాయిలెట్ కాంప్లెక్స్‌లు, సావనీర్ షాపులు, ఫుడ్ కోర్ట్, ఎటిఎం & బ్యాంకింగ్ సేవలు తదితర అత్యాధునిక సౌకర్యాలను భక్తులకు,యాత్రికులకు ప్రసాద్ స్కీం ద్వారా అందించనున్నారు.