తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి

తిరుమల: తిరుమల శ్రీవారిని సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముదర్శించుకున్నారు.శ్రీ వారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టీటీడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి,, టీటీడి ఈ.ఓ ధర్మారెడ్డి,, నరసింహకిషోర్ స్వాగతం పలికారు. ముందుగా రాష్ట్రపతి వరాహ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం శ్రీవారి ఆలయ ముఖ ద్వారం వద్ద చేరుకోగా ఆలయ ప్రధాన అర్చకులు రాష్ట్రపతి వారికి ఆలయ మర్యాదలతో ఇఫ్తేకాల్ స్వాగతం పలికారు. ధ్వజ స్థంభం వద్ద మొక్కులు చెల్లించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొన్నారు.అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా టీటీడి ఛైర్మన్ మరియు ఈ.ఓ శేష వస్త్రం తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్ర పటాన్ని అందజేశారు.