నివాసంను వదిలి వెళ్లిపోయిన శ్రీలంక అధ్యక్షడు

అమరావతి: శ్రీలంక అధ్యక్ష,ప్రధానులు తీసుకుని నిర్ణయాలతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో శనివారం అనూహ్య సంఘటన జరిగింది..శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స తన నివాసంను వదిలి పారిపోయినట్లు శ్రీలంక మీడియాలో వార్తలు వచ్చాయి..రాజీనామా చేయాలంటూ నిరసనకారులు అధ్యక్షడి ఇంటిని చుట్టుముట్టడంతో,,ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు కథనంలో పేర్కొన్నారు..పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిపైన వాటర్ కాన్ లను ప్రయోగించి,,నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స పారిపోయిన విషయాన్ని శ్రీలంక రక్షణ శాఖ కూడా ధ్రువీకరించినట్లు కథనాల్లో ప్రస్తావించారు.. గతంలో కూడా అప్పటి ప్రధాని మహింద రాజపక్స ఇంటిని నిరసనకారులు ఇలాగే చుట్టుముట్టిన సమయంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది..మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి ??