స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ వాహక నౌకను జాతీకి అంకింతం ఇచ్చిన ప్రధాని మోదీ

అమరావతి: భారతదేశం, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ యుద్ధ నౌక ద్వారా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచిందని,,INS విక్రాంత్ దేశానికే గర్వకారణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..శుక్రవారం కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో ఈ యుద్దనౌకను ప్రధాని మోదీ…జాతికి అంకితమిచ్చారు..ఈ సందర్బంలో ప్రధాని మాట్లాడుతూ… INS విక్రాంత్ చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని చెప్పారు. INS-విక్రాంత్ రాకతో హిందూ మహాసముద్ర జలాల్లో గస్తీ మరింత పటిష్ఠం కానున్నదని అన్నారు..ప్రపంచ పటంలో భారత్ ను ఈ నౌక సమున్నత స్థితిలో నిలుపుతుందని తెలిపారు. INS విక్రాంత్ సాతంత్ర్య సమరయోధుల కలలకు సాకారంగా నిలుస్తుందని చెప్పారు..మన దేశం తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని,,దేశానికి కొత్త భరోసా INS విక్రాంత్ ద్వారా సాధ్యమైందన్నారు..దీని నిర్మాణంలో పాల్గొన్న అందరికీ అభినందనలని అన్నారు..భారత్ కృషి, పరిశ్రమ, ప్రతిభకు నిలువుటద్దం ఐఎన్‌ఎస్ విక్రాంత్ అని ప్రధాని అన్నారు..నౌక నిర్మాణంలో ఉపయోగించిన ఇనుము స్వదేశంలోనే తయారైంది..ఛత్రపతి శివాజీ…నౌకాదళ ఏర్పాటుతో శత్రువులకు నిద్ర లేకుండా చేశారని,,అందుకే INS-విక్రాంత్‌ను ఛత్రపతి శివాజీకి అంకితమిస్తున్నాను అని అన్నారు..
INS-విక్రాంత్ నౌక 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది..ఈ నౌక గంటకు 28 నాటికల్ మైళ్ల(దాదాపు 51 కీ.మీ) వేగంతో ప్రయాణించనుంది..దీని తయారీకి 13 ఏళ్ల సమయం పట్టగా,,రూ.20 వేల కోట్లు ఖర్చయ్యింది..262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక బరువు 37,500 టన్నులు.. ఇందులో మొత్తం 14 అంతస్తులు, 2300 కాంపార్ట్ మెంట్స్ ఉన్నాయి..విధుల్లో 1600 మంది సిబ్బంది ఉంటారు.