బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన ప్రధాని మోదీ

అమరావతి: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 (96) మరణించిన సందర్బంగా 11వ తేదీన జాతీయ సంతాప దినంగా భారత్ ప్రకటించింది..సంతాప సూచకంగా ఆదివారం భారత జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేయనున్నారు..రాణి ఎలిజబెత్ మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ,ఈ కాలపు గొప్ప నాయకురాలిగా రాణి ఎలిజబెత్ ను అభివర్ణించారు..బ్రిటన్ కు సమర్థమైన,,స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని రాణి ఎలిజబెత్-2 అందించారని మోడీ కొనియాడారు.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎలిజబెత్-2 గురువారం రాత్రి స్కాట్‌ల్యాండ్‌లోని బాల్‌మోరల్ ప్యాలెస్‌లో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.. శుక్రవారం ఉదయమే రాణి ఎలిజబెత్ భౌతిక కాయాన్ని బ్రిటన్ ప్యాలెస్ కు తీసుకు వచ్చారు..