వడోదరలో విమానాల తయారీ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

అమరావతి: దేశంలో మేకిన్ ఇండియా ట్యాగ్ తో తయారు చేయబడిన C-295 విమానాలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ లో తయారు చేయబడే విమానాలు సైన్యానికి కొత్త శక్తిని అందించడమే కాకుండా విమానాల తయారీలో కొత్త నిర్మాణ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తాయన్నారు.అదివారం గుజరాత్, వడోదరలో ప్రధాని నరేంద్ర మోడీ విమానాల తయారీ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నరంగంలో విమానయాన రంగం ఒకటి అని మోడీ తెలిపారు. త్వరలో ఎయిర్ ట్రాఫిక్ పరంగా ప్రపంచంలో టాప్ 3 కంట్రీస్ సరసన భారత్ ప్రవేశించబోతోందన్నారు. వచ్చే 10 సంవత్సరాల్లో దేశంలో ప్రజా రవాణా,సైన్యంకు కలిపి దాదాపు 2 వేలకు పైగా విమానాలు అవసరమవుతాయని మోడీ వెల్లడించారు.ఈకార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్,పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్యా సింధియా తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు సైన్యంలో రవాణా విమానలుగా సేవాలు అందిస్తున్నఆవ్రో-784 స్థానంలో C-295 విమానలు సేవాలు అందించనున్నాయి.గత సంవత్సరం ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో, భారత్ వైమానిక దళం రూ.21 వేల కోట్ల బడ్జెట్ తో 56 C-295 రవాణా విమానాలను తయారు చేసే ఒప్పందం చేసుకుంది.