సర్ధార్ వల్లభాయిపటేల్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ

అమరావతి: గుజరాత్‌లో సర్థార్ వల్లభాయి పటేల్ 147వ జయంతి పురస్కరించుకుని నర్మదా నదిలోని సర్థార్ వల్లభాయి పటేల్ విగ్రహం పాదాలకు మోడీ పాలాభిషేకం నిర్వహించారు. ఏక్తా దివస్ వేడుకల్లో త్రివిధ దళాల పరేడ్ నిర్వహించారు. భారత ఉక్కు మనిషి, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతిని పురస్కరించుకుని, స్టాచ్యు ఆఫ్ యూనిటీ యూనిటీ ఎదురుగా జంగిల్ సఫారీకి సమీపంలో ఏర్పాటు చేసిన మియావాకి ఫారెస్ట్ గార్డెన్, భుల్భులయ్య పార్క్ ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రజలకు అంకితం చేశారు. సర్థార్ వల్లభాయి పటేల్ వల్లనే భారత దేశం ఏకమైందని ప్రధాని మోడీ అన్నారు. స్వాతంత్య్ర సమయంలో పటేల్ నాయకత్వం లేకుంటే ఏ జరిగి ఉండేదో అని ఊహించుకుంటేనే ఆందోళన కలిగిస్తోందని అన్నారు.పటేల్ ఉక్కు సంకల్పంతో 550 పైగా సంస్థానాలను ఏకం చేశారని గుర్తు చేశారు. సర్ధార్ పటేల్ భారతదేశం పట్ల అంకితభావాన్ని చూపకపోతే పరిస్థితి మరోలా ఉండేదన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi pays tribute at the Statue of Unity in Kevadiya, Gujarat on the occasion of the birth anniversary of #SardarVallabhbhaiPatel
(Source: DD News) pic.twitter.com/3QjMwjUCEX
— ANI (@ANI) October 31, 2022