నేతాజీ సుభాశ్ చంద్రబోస్ విగ్రహాన్ని అవిష్కరించిన ప్రధాని మోదీ

రాజ్ పథ్ ఇక నుంచి కర్తవ్యపథ్..
అమరావతి: దేశ రాజధానిలో కొత్తగా నామకరణం చేసిన కర్తవ్యపథ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ప్రారంభించారు..తొలుత ఇండియా గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన నేతాజీ సుభాశ్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో బాగంగా ఇండియా గేట్ వద్ద 28 అడుగుల ఎత్తు,6 అడుగుల వెడల్పుతో 300 టన్నుల గ్రానైట్ తో చెక్కిన నేతాజీ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.. ప్రఖ్యాత కళాకారుడు అరుణ్ యోగిరాజ్ ఆధ్వర్యంలో విగ్రహం రూపకల్పన చేశారు.. దేశంలోని ఎత్తైన ఏకశిలా విగ్రహాల సరసన నేతాజీ విగ్రహం చేరింది.. కర్తవ్యపథ్:- ఇండియా గేట్ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మార్గాన్ని ఇక నుంచి కర్తవ్యపథ్‌గా పిలుస్తారు..నూతన పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో కూడిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కర్తవ్యపథ్‌ను అభివృద్ధి చేశారు..వలసవాద విధానాలు,,పేర్లు,,చిహ్నాలను రద్దు చేస్తామని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించగా అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పేర్లు మార్పు చేపట్టింది.. బ్రిటిష్‌వారి కాలంలో కింగ్స్‌వే(Kings Way) అని పిలవగా స్వాతంత్ర్యం తర్వాత రాజ్‌పథ్‌గా నామకరణం చేశారు..నేటి నుంచి కర్తవ్యపథ్‌గా మారింది..
नए भारत का ‘कर्तव्यपथ’ pic.twitter.com/WxKYwRZAno
— Smriti Z Irani (@smritiirani) September 8, 2022