దీపావళికి 75వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందచేయనున్న ప్రధాని మోదీ

దీపావళి బహుమతి..
అమరావతి: దీపావళికి దేశవ్యాప్తంగా 75వేల మంది యువతకు వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇవ్వనున్నారు. దివాళీకి రెండు రోజుల ముందు వారితో వర్చువల్గా సమావేశమై వివిధ అంశాలపై మాట్లాడాతారు.అనంతరం అదే రోజు వారికి రక్షణ, రైల్వే, హోం, కార్మిక, తపాల, ఉపాధి, సీఐఎస్ఎఫ్, సీబీఐ, కస్టమ్స్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు..ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి పలువురు కేంద్రమంత్రులు ఈ వర్చువల్ మీటింగ్కు హాజరుకానున్నట్లు సమాచారం.. ఒడిశా నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గుజరాత్ నుంచి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ, చండీఘడ్ నుంచి అనురాగ్ ఠాకూర్, మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్ సహా వారి వారి పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎంపీలు హాజరుకానున్నారు.. రాబోయే 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోడీ జూన్‌లో దేశ యువతకు హామీ ఇచ్చారు.