ఈనెల 19న హైదరాబాద్ కు ప్రధాని మోదీ రాక

వందే భారత్ రైలు ప్రారంభం!
హైదరాబాద్: తెలుగు ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వందే భారత్ రైలును సేవాలను ప్రారంభించడానికి ఈ నెల 19వ తేదిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు రానున్నారు..కాజీపేట మీదుగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగులు పెట్టనున్నది..అభివృద్ది పనుల్లో బాగంగా కాజీపేట వర్క్ షాప్,, సికింద్రబాద్ స్టేషన్ రీమెడలింగ్, సికింద్రాబాద్-మహబూబ్ నగర్ మధ్య ట్రాక్ డబ్లింగ్ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.. హై టెక్నాలజీలో పరుగులు తీస్తున్న వందే భారత్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో సేవాలను అందిస్తొంది…దశలవారీగా అన్ని జోన్లలో ప్రవేశపెడుతున్న ఈ ట్రైన్ నెల క్రిందటే,తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టాల్సి వుండగా,,రైలు వేగంను తట్టుకునే సత్తా,,సింద్రాబాద్,,విజయవాడ మథ్య ట్రాక్ కు లేదు..దింతో రైల్వే అధికారులు యుద్దప్రతిపాదిన,,ట్రాక్ ను అధునికరించారు..వందే భారత్ రైలు గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.. కేవలం రెండు నిమిషాల్లోనే 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.. ఈ రైలు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి కాజీపేట మీదుగా విజయవాడ,,,రెండోది నల్గొండ మార్గం ద్వారా విజయవాడ..