ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీకి అస్వస్థత,ఆసుపత్రికి తరలింపు

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోదీ బుధవారం అస్వస్థతకు గురయ్యారు.వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఆమె వందో సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆమె 100వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్‌లోని తన తమ్ముడు పంకజ్ మోదీ నివాసానికి వెళ్లి తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెతో అరగంట పాటు ముచ్చటించారు.. హీరాబెన్ మోదీ 1923 జూన్ 18న జన్మించారు.తల్లి హీరాబెన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో,,ప్రధాని మోదీ హుటహుటిన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లారు.మెహతా ఆస్పత్రికి చేరుకుని తల్లి పరామర్మించారు..తల్లికి అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లు అడిగి తెలుసుకున్నారు..ప్రధాని రాకతో అప్రమత్తమైన గుజరాత్ పోలీసులు నగర వ్యాప్తంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.ఆసుపత్రి వైద్యులు హీరాబెన్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.