NATIONAL

3వ వందేభారత్ స్పీడ్ ట్రైన్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

అమరావతి: దేశంలో 3వ వందేభారత్ స్పీడ్ ట్రైన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ చెన్నైలోని ICF లో కోచ్ లు తయారు చేశారన్నారు. భారతదేశంలో ఎంతో నైపుణ్యం కలిగి వున్న ఇంజనీర్లు వున్నరని ,ఒక సందర్బంలో వారితో నేను మాట్లాడుతూన్నప్పుడు,రాబోయే రోజుల్లో వేగంగా ఎక్కువ సంఖ్యలో కోచ్ లు తయారు చేసి అందిస్తామని తెలిపారన్నారు.దేశంలో మౌలిక వసతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని,వాటి ఫలితాలు రావడం ప్రారంభంమైయ్యాయన్నారు.యువతకు రాబోయే రోజుల్లో ఉజ్వలమైన భవిష్యత్ వుందన్నారు.

వందేభారత్:- గుజరాత్ రాజధాని గాంధీనగర్‌ నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబై మధ్య నడిచే ఈ రైలు ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో ప్రయాణికులకు సేవాలు అందిస్తుంది. వందే భారత్ ట్రైన్-20901 ముంబై సెంట్రల్ వద్ద ఉదయం 6.10కి బయలుదేరి గాంధీ నగర్ కు మధ్యాహ్నం 12.30కి చేరుకుంటుంది.తిరిగి ట్రైన్-20902 గాంధీ నగర్ నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం 2.05కు బయలుదేరి, ముంబై సెంట్రల్ కు రాత్రి 8.35కు చేరుకుంటుంది.ఈ ట్రైనులో 16 కోచులు ఉంటాయని, 1,128 మంది ప్రయాణికులు ఇందులో కూర్చోవచ్చని అధికారులు తెలిపారు. గాంధీనగర్‌ నుంచి ముంబై మధ్య ఉండే సూరత్, వడోదర, అహ్మదాబాద్ (మూడు స్టేషన్లలో)లో మాత్రమే ఈ రైలు ఆగుతుందని తెలిపారు. దేశంలోని రైలు ప్రయాణికుల కోసం సౌకర్యవంతమైన, మెరుగైన రైలు ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఈ రైళ్లను ప్రవేశపెడుతున్నారు.దేశంలో 400 కొత్త తర వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు గత కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీటిని రాబోయే 3 సంవత్సరాల్లో తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తక్కువ విద్యుత్తును వినియోగించుకునేలా, తక్కువ బరువు ఉండే అల్యూమినియంతో వీటిని అభివృద్ధి చేస్తున్నారు. వీటి కోసం రైల్వే శాఖకు రూ.1,40,367.13 కోట్లు కేటాయించారు. ఇప్పటికే దేశంలో రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.అందులో న్యూఢిల్లీ-వారణాసీ, న్యూఢిల్లీ-వైష్ణోదేవి కత్రా మధ్య వాటి సేవలు అందుతున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *